హైదరాబాద్: యువకుల సహనానికి ప్రభుత్వం పరీక్ష పెట్టిందని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అగ్నిపథ్ స్కీమ్ వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్న సందర్భంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. బిజెపి నాయకులు తెచ్చే చట్టాలకు దేశం ప్రజలు తలొంచుకొని అంగీకరించాలన్న తీరుగా పిఎం మోడీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రోడ్ల మీదికి వస్తున్న లక్షల మంది అభ్యర్థులను ఆవేదనను అర్థం చేసుకోవాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇంత పెద్ద నిర్ణయం ఏకపక్షంగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. విపక్షాలను సంప్రదించకుండా, పార్లమెంట్‌లో చర్చించకుండా నిర్ణయాన్ని ఎలా ప్రకటిస్తారని అని రేవంత్ నిలదీశారు. మరో 20 రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని, పార్లమెంట్‌లో చర్చించాకే మోడీ అగ్నిపథ్ ప్రకటించాల్సిందని సూచించారు. ప్రజలు, అభ్యర్థుల అభిప్రాయాలను కేంద్రం తీసుకోవాల్సిందేనన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో కూడా బస్సులు, రైళ్లను తగులబెట్టారని, వేలాది మంది యువకులు నిరసనలో పాల్గొన్నారని చెప్పారు. బాధ్యత కలిగిన కిషన్ రెడ్డి ఎం మట్లాడుతున్నారని, వాళ్ళ అధ్యక్షుడి నాలెడ్జ్ అంతేనని చురకలంటించారు. కాంగ్రెసు పిలుపునిస్తే టిఆర్ఎష్ ఎంఐఎం దాడి చేస్తుందా? ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భమా? అని మండిపడ్డారు. కిషన్ రెడ్డికి బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా? అని నిలదీశారు. వారణాసిలో కూడా దాడులు జరిగాయి కదా అక్కడ కూడా కాంగ్రెస్ చేయించిందా? ప్రశ్నించారు. ఎఐసిసి ఆదేశాల ప్రకారం తాను వరంగల్ కు పోతున్నానని, దామెర రాకేష్(18) కుటుంబాన్ని పరామర్శిస్తానన్నారు. హింస పరిష్కారం కాదన్నారు. దేశ వ్యాప్తంగా జరిగిన చర్యలే సికింద్రాబాద్ లో జరిగిందన్నారు. దేశ బలం జవాన్, కిసాన్ అని తెలిపారు. అగ్నిపథ్ స్కీమ్ క వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా యువకులు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాలలో హింసచెలరేగింది.