- Advertisement -
హైదరాబాద్: ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆదివారం రేవంత్ మీడియాతో మాట్లాడారు. పండిన పంటను కెసిఆర్ ప్రభుత్వం కొనడంలేదని మండిపడ్డారు. వరి వేసుకుంటే ఉరేసుకున్నట్లే అని సిఎం కెసిఆర్ అన్నారని గుర్తు చేశారు. చెరుకు ఫ్యాక్టరీలను మూసేసి రైతుల నోట్లో మట్టికొట్టారని దుయ్యబట్టారు. తెలంగాణలో రైతులను బాగు చేయలేని కెసిఆర్, దేశంలో బాగు చేస్తారా? అని ప్రశ్నించారు. అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ అనే అర్హత సిఎం కెసిఆర్‌కు లేదని విమర్శలు గుప్పించారు. డబ్బులతో ఎన్నికల్లో గెలవాలని బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు భావిస్తున్నాయని మండిపడ్డారు. మోడీది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదని, ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అని ఎద్దేవా చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు.
- Advertisement -