Monday, December 23, 2024

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిపిసిపి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గురువారం సిట్ ముందు హాజరుకానున్నారు. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీపై తన దగ్గర ఆధారాలు ఉన్నయని రేవంత్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి ఆధారాలుంటే ఇవ్వాలని రేవంత్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. గురువారం 11 గంటలకు సిట్ ఎదుట హాజరుకావాలని రేవంత్‌కు నోటీసు ఇచ్చింది.

ఇవాళ సిట్ ఎదుట హాజరుకావాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్భందం చేశారు. రేవంత్ సిట్ ముందుకు వెళ్తున్న సందర్భంగా పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు మల్లు రవి, అద్దంకి దయాకర్, హనుమంతరావును గృహనిర్భంధం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News