Sunday, January 19, 2025

ఈ ఎన్నికలు తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి మధ్య పోటీ: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: రాజ్యాంగ మార్పు అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలోనే చేర్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగం మార్పుకు సంబంధించిన అన్ని వివరాలతో పాటు బిజెపి కుట్రలు సాయంత్రం ఐదు గంటలకు బయటపెడుతానని హెచ్చరించారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు రిజర్వేషన్లు కొనసాగించాలని చెప్పినందుకే తనపై కేసు పెట్టారని, ఇవాళ ఢిల్లీ పోలీస్ స్టేషన్లలో హాజరుకావాలని హుకుం జారీ చేశారని, ఎన్నికల ప్రచారం మానేసి పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలంటారా?, ఇదేం దౌర్జన్యం అని అడిగారు. మోడీకి ప్రధానిగా బాధ్యత ఇచ్చింది, రేవంత్‌ను పోలీస్ స్టేషన్‌లో వేయడానికి కాదు అని చురకలంటించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని కోరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 20 ఏళ్ల నుంచి ఎన్నో ఆటుపోట్లు చూశామని, గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణలో ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పెత్తనం ఏంటని? నిలదీశారు.

పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి మధ్య పోటీ అని ప్రజలకు రేవంత్ తెలియజేశారు. గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ నడిగడ్డపై నిలబడి సిఎంను బెదిరిస్తారా?, మోడీ భయపెడితే బెదరడానికి ఇక్కడెవరూ లేరని, ఖబడ్దార్ మోడీ అని, గుజరాతోళ్లు భయపెడితే బెదిరేవాళ్లు ఇక్కడెవరూ లేరని రేవంత్ హెచ్చరించారు. ఆధిపత్యంలో భయపెట్టి ఎంతకాలం రాజ్యాన్ని ఏలుతారని, భయపెట్టి అన్యాయంగా రాజ్యాలు ఏలాలంటే నిజాం నవాబుకు ఎలాంటి గతి పట్టిందో తెలుసుకోవాలని బిజెపి వాళ్లకు రేవంత్ సూచించారు. భయపెట్టిన రజాకార్ల పరిస్థితి ఏమైందో తెలుసుకోవాలని, రిజర్వేషన్ల రద్దు వద్దు అని చెప్పానని, రాజ్యాంగం మార్చొద్దని చెప్పానని, తాను చెప్పింది నచ్చితే స్వీకరించాలని లేకపోతే రాజ్యాంగాన్ని మారుస్తానని, రిజర్వేషన్లు రద్దు చేస్తానని చెప్పి బిజెపి వాళ్లు ఓట్లు అడగాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News