Sunday, December 22, 2024

మోడీ కాలం చెల్లిందని ప్రజలు తీర్పు ఇచ్చారు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే సమస్యలు పరిష్కరించుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ చట్టపరంగా తేలిపోయిందని, హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణకు సంపూర్ణ రాజధాని అయిందన్నారు. కేంద్రంలో 2014, 2019లో బిజెపికి పూర్తి మెజార్టీ ఇచ్చారని, 2024 ఎన్నికల్లో మోడీ గ్యారంటీని దేశ ప్రజలు తిరస్కరించారని, మోడీ కాలం చెల్లిందని ప్రజలు తీర్పు ఇచ్చారని, ప్రధాని పదవికి తక్షణమే మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం రేవంత్ మీడియాతో మాట్లాడారు.

మూడోసారి కూడా మోడీ ప్రధాని పదవి చేపడితే విలువలతో కూడి రాజకీయాలు చేయనట్టేనని ఎద్దేవా చేశారు. తాను జిల్లాకు ముఖ్యమంత్రిని కాను అని, గెలుపు ఓటములకు తానే బాధ్యుడిగా వ్యవహరిస్తానని, తన సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి తనదే బాధ్యత అని రేవంత్ స్పష్టం చేశారు. వచ్చిన ఫలితాలు ఉగాధి పచ్చడిలాంటివని, రాష్ట్రానికి పరితమైన నాయకుణ్ణి, తన బాధ్యత రాష్ట్రానికే పరిమితమవుతుందన్నారు. మెదక్‌లో కాంగ్రెస్‌కు చెందిన బిసి అభ్యర్థిని ఓడించారని, గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్ వచ్చిన ఓట్ల శాతాన్ని బిజెపికి బదిలీ చేశారని, 22 శాతం ఉన్న బిఆర్‌ఎస్ ఓట్లను హరీష్ రావు బిజెపికి బదిలీ చేశారని, 2001 నుంచి 2023 వరకు సిద్దిపేటలో బిఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ వచ్చిందని, బిఆర్‌ఎస్ ఓటింగ్ శాతం 16.5 శాతానికి పడిపోయిందని, తెలంగాణలో వంద రోజుల్లో గ్యారెంటీలను అమలు చేశామని రేవంత్ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నచ్చితే ఓటు వేయాలని లోక్ సభ ఎన్నికల్లో ప్రజలను అడిగామని, రాష్ట్రంలో 8 మంది కాంగ్రెస్ ఎంపి అభ్యర్థులు గెలిచారని, వంద రోజుల పాలన తరువాత 41 శాతం ఓట్లు కాంగ్రెస్‌కు వచ్చాయని, అసెంబ్లీ ఓట్ల శాతం కంటే ఎక్కువగా లోక్ సభ ఎన్నికల్లో వచ్చాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

కాంగ్రెస్ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తాము భావిస్తున్నామని, ఎనిమిది ఎంపి సీట్లు గెలిపించిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. 2019లో కాంగ్రెస్‌కు మూడు ఎంపి సీట్లు వస్తే ఇప్పుడు 8 ఎంపి సీట్లు గెలిచామని, బిఆర్‌ఎస ఏడు సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందన్నారు. ఏడు సీట్లలో బిజెపిని గెలిపించి బిఆర్‌ఎస్ నేతలు అవయవదానం చేశారని, బిఆర్‌ఎస్ నుంచి బలహీన అభ్యర్థులను పెట్టి బిజెపి నేతలు గెలుపు కోసం కెసిఆర్ కృషి చేశారని, మెదక్‌లో కాంగ్రెస్‌కు చెందిన బిసి అభ్యర్థిని ఓడించారని, గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు వచ్చిన ఓట్ల శాతాన్ని బిజెపికి బదిలీ చేశారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News