Thursday, November 14, 2024

అసలు రైతుబంధు కౌలుదారులకా, పట్టాదారులకా..!:రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతుబంధుకు సంబంధించి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఇంటర్వూలో రేవంత్‌రెడ్డి రైతుబంధుకు సంబంధించి చెప్పిన మాటలు గందరగోళంగా ఉండడంతో బిఆర్‌ఎస్ పార్టీ ఈ వీడియోను తమ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే అధికారంలోకి రాకముందే ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

క్లారిటీ లేని హామీలు ఇలాగే…!
తాము అధికారంలోకి వస్తే కౌలుదారులకు, పట్టాదారులకు రైతుబంధును వేస్తామని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొనడంతో రైతులు గందరగోళంలో పడ్డారు. ఈ రైతుబంధు అసలు పట్టాదారులుకా, కౌలుదారులుకా అనేది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారిందని, క్లారిటీ లేని హామీలు ఇలా ఉంటాయని బిఆర్‌ఎస్ నాయకులు ఈ వీడియోలో పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News