Sunday, December 22, 2024

పది రోజుల్లోనే రూ. 15 వేలు వేస్తా: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిజంగా రైతులకు మేలు చేసే ఉద్దేశం కెసిఆర్, హరీశ్‌కు లేదని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సోమవారం రేవంత్ మీడియాతో మాట్లాడారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత మాత్రమే ఉందని, హరీష్ రావు వ్యాఖ్యల వల్ల రైతుబంధుకు ఈసీ అనుమతి రద్దు చేసిందన్నారు. మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలే కారణమని ఇసి చెప్పిందని గుర్తు చేశారు. మంత్రి హరీష్ రావు నియమావళి ఉల్లంగించారని ఐసి పేర్కొన్న విషయం తెలిసిందే. పంటసాయంపై రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News