Tuesday, January 21, 2025

స్విస్‌ బ్యాంకుకు అప్పు ఇచ్చే స్థాయిలో బిఆర్ఎస్ వాళ్లు ఉన్నారు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతులను ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతు భరోసా విధివిధానాలపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో రేవంత్ మాట్లాడారు. రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ముందు ఉంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రైతుబంధు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సాగులో లేని భూములకూ రైతుబంధు ఇచ్చారని, దీని ద్వారా రూ.22,600 కోట్ల బడాబాబులకు లబ్ధి చేకూరిందన్నారు. రియల్‌ ఎస్టేట్‌, పారిశ్రామికవేత్తలకూ రైతుబంధు ఇచ్చారన్నారు. రాళ్లకు, గుట్టలకూ రైతుబంధు ఇద్దామా? అని తెలంగాణ రైతులను అడిగారు. రైతు భరోసాపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని,  రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చేందుకు రైతు భరోసా తీసుకొచ్చామని. రైతు భరోసా అమలు చేయడానికి సభ్యులంతా సలహాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ కోరారు.

తెలంగాణపై రూ.6.70 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారని, ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌, ప్రాజెక్టుల పెండింగ్‌ బిల్లులు కలిపి రూ.40వేల కోట్లపైనే ఉన్నాయన్నారు. సభలో బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు బాధ్యత లేకుండా వ్యవహరించడం సరికాదన్నారు. బిఆర్ఎస్‌కు ప్రతీది వ్యాపారమైందని దుయ్యబట్టారు. బిఆర్ఎస్‌ చేసిన రుణమాఫీ వడ్డీకే సరిపోయిందని అసలు అలాగే ఉండిపోయిందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. స్విస్‌ బ్యాంకుకు కూడా అప్పు ఇచ్చే స్థాయిలో బిఆర్ఎస్ వాళ్లు ఉన్నారని,  బిఆర్ఎస్‌ నాయకులు తలుచుకుంటే తెలంగాణపై ఉన్న రూ.7 లక్షల కోట్లు కూడా చెల్లించగలరని విమర్శలు గుప్పించారు. తెలంగాణ సంపద అంతా బిఆర్ఎస్ నాయకుల చేతుల్లోకి వెళ్లిందన్నారు. ఎఫ్ఇఒ సిఇఒ ఇక్కడ భూమి కొంటే కూడా ఆయనకు రైతు భరోసా ఇవ్వాలా? అని బిఆర్ఎస్ ఎంఎల్ఎలను రేవంత్‌రెడ్డి అడిగారు. కొడంగల్ ప్రజలకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనన్నారు. కోట్లు ఖర్చు చేసి అధికారుల మీద దాడి చేయించడం మంచిది కాదని, అధికారులను చంపినంత పని చేశారని మండిపడ్డారు. కొడంగల్‌లో పరిశ్రమలు పెట్టొద్దా? ఉద్యోగాలు ఇవ్వకూడదా? అని రేవంత్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News