Monday, December 23, 2024

పేపర్ లీకేజీ కేసులో ప్రభుత్వ పెద్దలకు సంబంధాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి దొంగలు, దోపిడీదారులకు అడ్డాగా మారిందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అనర్హులను సభ్యులుగా నియమించారని పేపర్ లీక్‌ పై ప్రభుత్వం కోర్టులో విచారణ ఎదుర్కొంటుందని విమర్శించారు. ఆధారాలు బయట పెడితే తమమీదే కేసులు పెడుతున్నారని, శంకర్‌లక్ష్మి నుంచే నేరం మొదలైతే ఆమెనే సాక్షిగా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేపర్ లీక్‌జీ కేసులో ప్రభుత్వ పెద్దలకు సంబంధాలు ఉన్నాయని, ప్రభుత్వ పెద్దలను తప్పించడానికే సిట్‌ను నియమించారని ఆరోపించారు. పెద్దలను కాపాడి దిగువస్థాయి ఉద్యోగులను బలి చేస్తున్నారని, పేపర్ లీక్ కేసులో విదేశాల్లో ఉన్నవారితో హవాలా రూపంలో నగదు చేతులు మారింద న్నారు. సిట్ కొద్దిమందిని విచారించి కొందరిని వదిలేస్తుందని, అందరినీ విచారించాలని ఇడికి ఫిర్యాదు చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News