హైదరాబాద్: అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వాశర్మపై ఎంపి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ”అస్సాం ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలి. పోలీసులు అధికారులు నేను చేసిన ఫిర్యాదుకు ఈరోజు ఉదయం వరకు ఎఫ్ఆర్ఐ నమోదు చేయలేదు. ఎఫ్ఆర్ఐలో నమోదు చేసిన సెక్షన్స్ సంతృప్తి కరంగా లేవు. పోలీసులు పెట్టిన సెక్షన్స్ వల్ల నా ఫిర్యాదు నిరుగారిపోతోంది. సెక్షన్స్ సంతృప్తికరంగా లేవు కాబట్టే మళ్ళీ ఫిర్యాదు చేశాను. మళ్ళీ కొత్త ఎఫ్ఆర్ఐలో బలమైన సెక్షన్స్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నా. వారు నమోదు చేసిన సెక్షన్ల వల్ల నేను చేసిన ఫిర్యాదు రూపమే మారిపోతుంది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది ఆపరేషన్ సక్సెస్ బట్ పేషేంట్ డెడ్ లాగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వత్తిడి మేరకు ఇలాంటి నామమాత్రంగా కేసులు నమోదు చేశారని అనుమానాలు కలుగుతున్నాయి. మహిళలను అత్యంత నీచంగా కించపరిచే విదంగా మాట్లాడిన హిమంత్ పైన బలమైన కేసులు నమోదు చెయ్యాలి. న్యాయ నిపుణుల సలహాలు తీసుకోని అస్సాం ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలి. పోలీసులు కేసును నిరుగారిస్తే.. న్యాయస్థానంలో కొట్లాడుతాం” అని పేర్కొన్నారు.
Revanth Reddy complaint against Assam’s CM