Sunday, September 8, 2024

ఇలాంటి తీర్మానం ప్రవేశ పెట్టాల్సి వచ్చినందుకు బాధగా ఉంది: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ శాసన బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. శాసన సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ దివంగత ఎంఎల్‌ఎ లాస్య నందిత మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశం పెట్టారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేపెట్టాల్సి వచ్చినందుకు చాలా చింతిస్తున్నామని విచారం వ్యక్తం చేశారు. లాస్య నందిత తండ్రి, దివంగత ఎంఎల్‌ఎ సాయన్న తనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారని, చాలా సంవత్సరాలు ఇద్దరం ప్రజాప్రతినిధులుగా కలిసి పని చేశామని, సాయన్న 1951లో నిజమాబాద్ జిల్లా వల్లభానగర్ లో అత్యంత సామాన్యమైన కుటుంబంలో సాయన్న జన్మించారని, జీవితంలో కష్టపడి ఐదుసార్లు ఎంఎల్ఎగా గెలిచి కంటోన్మెంట్ ప్రజలకు సేవలందించారని ప్రశంసించారు. ఆయన కంటోన్మెంట్ నిజయోకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.

ఎంఎల్‌ఎగా ఉన్నప్పుడు సాయన్న కన్నుమూయడంతో లాస్య నందిత తన తండ్రి వారసత్వాన్ని, బాధ్యతలను నెరవేర్చేందుకు రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఆయన బతికి ఉన్నప్పుడే ఆమె కార్పొరేటర్ గెలిచారని, లాస్య నందిత ఎంఎల్‌ఎగా గెలిచిన తరువాత కంటోన్మెంట్ ప్రజలు, మహిళల తరఫున చిత్తశుద్ధితో పోరాడుతున్న తరుణంలో ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం దురదృష్టకరమైన విషయమని బాధను వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో సాయన్న, లాస్యనందిత శాశ్వతంగా నిలిచిపోతారన్నారు. ఆమె మృతి పట్ల  రేవంత్ సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News