Wednesday, January 22, 2025

కుంజా సత్యవతి మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యవతి హఠాన్మరణం పట్ల కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేదలు, గిరిజనుల అభ్యున్నతికి సత్యవతి ఎంతో కృషి చేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సత్యవతి మృతి పట్ల కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డితోపాటు ఈటల రాజేందర్, డికె అరుణ, పలువురు బిజెపి నేతలు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెమ్ వీరయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తుమ్మల నాగేశ్వర రావులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కాగా, భద్రాచలంలోని ఆమె నివాసంలో రాత్రి తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటినా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మరణించారు. కుంజా సత్యవతి 2009లో భద్రాచలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది… 2009-2014 వరకు ఎమ్మెల్యే గా పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News