Monday, January 20, 2025

సాయిచంద్ మృతిపట్ల రేవంత్ రెడ్డి, ఈటల సంతాపం…

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మరణం పట్ల టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.ఆయన అకస్మిక మృతిపట్ల సంతాపం తెలిపారు.సాయిచంద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నామని తెలిపారు. తెలంగాణ గొప్ప కళాకారుడిని, ఉద్యమకారుడిని కోల్పోయిందని, సాయిచంద్ మరణం ఎంతో బాధాకరణమని అన్నారు.

బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా సాయిచంద్ మృతిపై సంతాపం తెలుపుతూ.. చిన్న వయసులోనే సాయిచంద్ మరణించడం బాధించిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఆట, పాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సాయిచంద్ ఎంతో కృషి చేశాడని చెప్పారు. సాయింద్ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతుడిని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News