- Advertisement -
ప్రజాపాలన దరఖాస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులపై సిఎం, కేబినేట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించారు. తెలంగాణలో ఐదు గ్యారంటీలకు ప్రభుత్వానికి 1,09,01,255 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జనవరి 12 నాటికి ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి అయిందన్నారు. మొత్తం దరఖాస్తుల్లో 2.82 లక్షల డూప్లికేట్ దరఖాస్తులు గుర్తించినట్లు వెల్లడించారు. రేషన్ కార్డులు, ఆధార్ నెంబర్లు లేకుండా కొన్ని దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తుల్లో కొందరు నంబర్లు తప్పుగా రాసినట్లు అధికారులు పేర్కొన్నారు. అసలైన అర్హులు నష్టపోకుండా వాటిని మరోసారి పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారును ఆదేశించారు.
- Advertisement -