Monday, April 28, 2025

కెసిఆర్ ప్రసంగం అక్కసుతో కూడుకున్నది: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎల్కతుర్తిలో జరిగిన బిఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆ పార్టీ అధినేత కెసిఆర్ చేసిన ప్రసంగానికి సిఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కెసిఆర్ తన ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రేవంత్ మాట్లాడుతూ.. కెసిఆర్ ప్రసంగం అక్కస్సుతో కూడుకున్నది అని అన్నారు. అధికారంలో ఉండగా.. ఖజానాను ఖాళీ చేసి తమ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. బిఆర్ఎస్‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని పేర్కొన్నారు. కెసిఆర్ అభద్రతాభావంతో మాట్లాడారని.. ఆయన ప్రసంగంలో స్పష్టత లేదని రేవంత్ తెలిపారు.

రాహుల్ గాంధీకి తనకు గ్యాప్ ఉందనడం అవాస్తవమని అన్నారు. రాహుల్‌కు తనకు ఉన్న సంబంధం ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అవసరాలను బట్టి కెసిఆర్, మోదీ మాటలు మారుస్తున్నారని అన్నారు. దేశానికి ఇందిరాగాంధీ లాంటి ప్రధాని కావాలని.. రెండు దేశాలను ఓడించిన ఘనత ఇందిరాగాంధీదే అని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News