Saturday, March 15, 2025

రేవంత్ తెలంగాణ పరువు తీశారు: వేముల ప్రశాంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ గురించి మాట్లాడిన మాటలపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సిఎంపై విమర్శల వర్షం కురిపించారు. మాజీ సిఎం కెసిఆర్ 14 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించారని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.. పదేళ్లుగా సిఎంగా పని చేసిన కెసిఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి జుగుప్సాకరంగా మాట్లాడి తెలంగాణ పరువు తీశారని ధ్వజమెత్తారు.

బిజెపి జపం చేస్తూ.. పొగుడుతూ, కెసిఆర్‌ను మాత్రం అగౌరవపరిచారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో సిఎంకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. ప్రతిపక్ష నేతకు అంతే ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. కెసిఆర్ మీద అక్కసుతో ఆయనకు సరైన ఛాంబర్ కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడు సూచించిన వారినే పిఎసి ఛైర్మన్‌గా నియమించడం ఆనవాయితీ అని కానీ ప్రతిపక్ష నేతను సంప్రదించకుండానే పిఎసి ఛైర్మన్‌ను నియమించి ఆనవాయితీని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News