Friday, January 10, 2025

ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిపిసిసి ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్తారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతో సమావేశం కానున్నారు. లోక్ సభ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు ఖరారుతో పాటు రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీపై రేవంత్ హైకమాండ్‌తో చర్చలు జరుపనున్నారు. లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 11 మంది మంత్రులకు శాఖలు కేటాయించగా మరో ఆరుగురికి శాఖలు కేటాయింపు చర్చలు జరిపే అవకాశం ఉంది. బిఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎంపిగా పోటీ చేసేందుకు నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. సికింద్రాబాద్, మేడ్చల్, మెదక్, కరీంనగర్ ఎంపి స్థానాలలో బిఆర్ఎస్ పార్టీ నేతల మధ్య తీవ్రమైన పోటీ ఉందని ఆ పార్టీ ముఖ్య నేతలు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News