Tuesday, December 24, 2024

మోడీ మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: రేవంత్

- Advertisement -
- Advertisement -

Revanth Reddy demands PM Modi apology to Telangana People

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను అవమానించిన మోడీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని నిలదీశారు. పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి కానీ తెలంగాణలో బిజెపి ఎందుకు సమావేశాలు పెడుతున్నారో అర్ధం కావట్లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లలో తెలంగాణకు కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వకుండా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, రెండు తెలుగు రాష్ట్రాలను మోడీ మోసం చేశారని దుయ్యబట్టారు. పార్లమెంట్ తలుపులు మూసి మరీ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే తల్లిని చంపి పిల్లను ఇచ్చారని పార్లమెంట్‌లో మోడీ మాట్లాడారని గుర్తు చేశారు.

తెలంగాణను గుర్తించడానికి కూడా మోడీ ముందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. మంత్రి పదవుల్లో దక్షిణ భారతదేశానికి ప్రాధాన్యమివ్వలేదన్నారు. తెలంగాణలో ఉన్న కేంద్రమంత్రి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ఎపికి అసలు మంత్రే లేడని ఎద్దేవా చేశారు. వెంకయ్యను ఉపరాష్ట్రపతి పదవి నుంచి దించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. తెలుగువారిని మోడీ అవమానిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కలవడానికి కాంగ్రెస్ నాయకులు, ఎంఎల్‌ఎలు సిద్ధంగా లేరని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కొండా విశ్వేశ్వర రెడ్డి తనకు మిత్రుడన్న రేవంత్ బిజెపిలో చేరిన కొద్దికాలానికి ఆయనే వెనుదిరిగి చూస్తారని వ్యాఖ్యానించారు.

Revanth Reddy demands PM Modi apology to Telangana People

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News