Monday, December 23, 2024

జగిత్యాల మాస్టర్‌ప్లాన్ పూర్తిగా రద్దు చేయాలి:రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

జగిత్యాలః జగిత్యాల పట్టణ మాస్టర్‌ప్లాన్ పూర్తిగా రద్దు చేయాలని టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లాలో రేవంత్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలను హింసించడానికే జగిత్యాల ఎంఎల్‌ఎ సంజయ్‌కుమార్ ఎన్నికల్లో గెలిచారా అని ప్రశ్నించారు. జలపతిరెడ్డి మృతికి కారణమైన న్యాయవాదిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలన్నారు.

ఐదేళ్లు ఎంపిగా ఉన్న కవిత అప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎందుకు స్పందించలేదన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్‌లు వీధి నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. దేశంలో అదానిపై చర్చ జరగకుండా, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా లిక్కర్ కేసును తెర మీదకు తెచ్చారన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే బిఆర్‌ఎస్ నాయకులు ముందుగా జంతర్‌మంతర్ వద్ద ముక్కు నేలకు రాసి కాంగ్రెస్ పార్టీ గురించా మాట్లాడాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News