Friday, December 20, 2024

కెసిఆర్ నీకు జీవితంలో అర్థం కాడు

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు కౌంటర్
మనతెలంగాణ/హైదరాబాద్ : వరంగల్ వేదికగా కెసిఆర్‌పై ఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. శాతగానోనికి మాటలెక్కువ, చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్లు ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి అని ఎద్దేవా చేశారు. పదకొండు నెలల పాలనలో ఆయన నోటి నుండి బూతులు తప్ప నీతులు రాలేదని అన్నారు. కాంగ్రెస్ విజయోత్సవ సభ అని పేరు పెట్టుకొని చేసింది ఏమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేక ఎప్పటి లాగే పిచ్చి మాటలు వదిలిండని విమర్శించారు.

ఇక నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు అని, అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుండి లంబాడి బిడ్డల దాకా నువ్వు చేసిన ఘోరాలు సమసిపోవు…తెలంగాణ ప్రజలు మరిచిపోరు అని సిఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. కెసిఆర్.. కెసిఆర్.. అంటూ కెసిఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన రేవంత్‌రెడ్డి పాపం పోదు అని… కెసిఆర్ వంటి గొప్ప వ్యక్తి రేవంత్‌రెడ్డికి జీవితంలో అర్థం కాడు అని పేర్కొన్నారు. తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చానని గప్పాలు కొడుతున్నవు… అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులను తొక్కినవు… షార్ట్ కట్‌లో అధికారం చేజిక్కించుకొని ప్రజలను తొక్కుతున్నవు అని మండిపడ్డారు. నీ వదురుబోతు తనంతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు… నీ దుర్భాషను ప్రజల విచక్షణకే వదిలేస్తున్నాం అంటూ సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News