Sunday, January 19, 2025

తెలంగాణలో మార్పు కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి: రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ పట్టణంలోని వివేకానంద విగ్రహం వద్ద జాతీయ రహదారిపై గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పదేళ్లు కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణకు చేసిందేమి లేదని గత కాంగ్రెస్ ప్రభుత్వమే హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిందని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించిందని, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటిని హైదరాబాద్‌లో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనేనన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సోనియమ్మ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫించన్ 4 వేలు ఇస్తామని, ఆడబిడ్డలందరికీ ప్రతి నెల 1వ తేదీన రూ. 2500 ఇస్తామని, మహిళలు ఉచితంగా ఆర్టీసి బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చునని అన్నారు.

కళ్యాణలక్ష్మీ పథకంలో భాగంగా ఒక లక్ష రూ పాయలతో పాటు తులం బంగారం ఇస్తామని, ఇళ్లు లేని ప్రతి నిరుపేదకు ఇంటిస్థలంతో పాటు ఐదు లక్షల రూపాయాలను ఇస్తామని, పిల్లల చదువులకు ఐదు లక్షల రూపాయాల బ్యాంకు గ్యారంటీ కార్డు ఇస్తామని అన్నారు. 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 10 లక్షల రూపాయలను అందించనున్నట్లు తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర వజ్రేష్‌యాదవ్‌ను చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వజ్రేష్‌యాదవ్ గెలిచిన సంవత్సరంలోపే మేడ్చల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం, రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జి పనులను పూర్తి చేస్తామన్నారు. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డును అక్కడ నుండి తొలగించి దుర్వాసన నుండి ప్రజలకు విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్‌మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మండల అధ్యక్షులు రమణారెడ్డి, గౌ డవెల్లి సర్పంచ్ సురేందర్, మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్ నడికొప్పు నాగరాజు, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణ, రాఘవేందర్‌గౌడ్, భూషణం, కొం డల్‌రెడ్డి, మల్లేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News