Monday, December 23, 2024

లీగల్ నోటీసులపై రేవంత్ రెడ్డి వివరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓఆర్ఆర్ లీజు విషయంలో పంపిన లీగల్ నోటీసులకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చాడు. ఐఏఎస్ అధికారి ఇచ్చిన లీగల్ నోటీసులు వెనక్కి తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అరవింద్ కుమార్ పంపిన లీగల్ నోటీసు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. లీగల్ నోటీసులో పేర్కొన్న ఆరోపణలన్నీ బూటకమని తెలిపారు.

ఐఆర్ బికి టెండర్ కట్టబేట్టే క్రమంలో నిబంధనలు ఉల్లంఘించినట్లే అన్నారు. ఓఆర్ఆర్ పై ట్రాఫిక్, టెండర్ మదింపు నివేదిక పబ్లిక్ డొమైన్ లో లేవన్నారు. అధికారపార్టీ అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకే ఈ అణచివేతంటూ ఆరోపించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా ప్రజల తరుపున పోరాడుతూనే ఉంటామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News