Wednesday, January 22, 2025

అస్సాం సిఎం ఒక తల్లిని అవమానించారు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

MP Revanth reddy comments on union budget 2022

హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి బిశ్వశర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ పిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సాం సిఎం ఒక తల్లిని అవమానించారని, మాతృత్వాన్ని అవమానించే వ్యాఖ్యలు చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి సంస్కారహీనమైన వ్యాఖ్యలపై చర్చ చేయాలని కాంగ్రెస్ అనుకోవడం లేదన్నారు. బిజెపి నేతలకు తల్లలు లేరా?, అస్సాం సిఎం డిఎన్ఎ ఏంటి? అని ప్రశ్నించారు. ఆయన డిఎన్ఎ చైనాదా? అని రేవంత్ విమర్శించారు. బిశ్వశర్మపై రేపు అన్ని పోలీసు స్టేషన్లలో కేసులు పెడుతామన్నారు. కేసులు పెట్టి సిఎం కెసిఆర్ కు చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.

Revanth Reddy fire on Assam CM Biswa Sarma

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News