Monday, March 3, 2025

బతుకు బస్టాండేనని బెంబేలు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్, బిజెపిలకు భయం పట్టుకుంది

ఆడబిడ్డలు ఆదరిస్తే మరో పదిహేను, ఇరవై ఏళ్ళు నేనే సిఎంగా ఉంటానేమోనని ఆ
పార్టీలకు కంగారు ఎస్‌ఎల్‌బిసి పాపాల భైరవుడు కెసిఆర్ సొరంగంలో 8మంది
మరణానికి ఆయనే కారకుడు నాడు కెసిఆర్ పెట్టిన సంతకం ఇప్పుడు పాలమూరుకు
యమపాశమైంది ఎస్‌ఎల్‌బిసిలో ప్రమాదం జరిగితే హరీశ్‌రావు విదేశాల్లో విహార
యాత్రలు చేశారు పథకాలు వస్తే మోడీ ఖాతాలో.. రాకపోతే రేవంత్ ఖాతాలోనా?
మోడీ సానుకూలంగా ఉన్నా.. కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారు కెసిఆర్, కెటిఆర్,
కిషన్‌రెడ్డి అడ్డంపడినా పాలమూరును పసిడిపంటల జిల్లాగా మారుస్తా నెలాఖరు లోగా
రూ.7621 కోట్ల రైతుభరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ వనపర్తి సభలో సిఎం
రేవంత్ ఏప్రిల్ 14లోగా స్వయం ఉపాధి గ్రూపులకు రూ.6వేల కోట్లు: డిపూటి సిఎం భట్టి

మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: పదేళ్లపాటు ఆడబిడ్డలు ఆదరిస్తే రేవంత్‌రెడ్డే ము ఖ్యమంత్రిగా మరో పదిహేను, ఇరవై ఏండ్లు ఉంటాడని, అప్పుడు మన బతుకు బస్టాం డేనని బిఆర్‌ఎస్, బిజెపి నేతలు భయపడు తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రక టించారు. రాష్ట్రాన్ని ఏలిన కెసిఆర్ ప్రాజెక్టు లు ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ మం డిపడ్డారు. వనపర్తి పాలిటెక్నిక్ మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో ఆయన పా ల్గొన్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగం లో బిఆర్‌ఎస్, బిజెపి అగ్ర నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు ప్రజల రుణం తీర్చుకునేందుకే తాను ముఖ్యమంత్రిని అన్నారు. వనపర్తితో తనకు విడదీయలేని బంధం ఉందని, చదువుతో పాటు సం స్కారాన్ని ఇచ్చిందని అన్నారు.

వనపర్తి నుంచి సర్వం నేర్చుకున్నానని, రాజకీయాల్లో రాణించడంలో వనపర్తి పాత్ర ఎంతో ఉందని చెప్పారు. వనపర్తి ప్రాంతంలో ఎన్నటికీ తెగిపోని బంధం తనదని చెప్పారు. వనపర్తి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. రాష్ట్రంలో వనపర్తికి ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. మాజీ ఎంఎల్‌ఎ జయరాములు యాదవ్, డా. బాలకిష్టయ్య, చిన్నారెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ కక్షలు లేకుండా, అభివృద్ధ్దే లక్షంగా పనిచేశారని అన్నారు. అయితే, ఐదేళ్ల క్రితం వనపర్తిలో గెలిచిన ఎంఎల్‌ఎ రాజకీయాలను కలుషితం చేశారని ఆరోపించారు. వనపర్తిలో అనేక విద్యాసంస్థలకు కాంగ్రెస్ ప్రభుత్వాలే పునాది వేశాయన్నారు. 25 లక్షల 50 వేల రైతులకు రూ. 22 వేల కోట్ల రుణమాఫీ జరిగిందా లేదా గుండెలపై చేయి వేసుకొని చెప్పాలని ప్రజలను కోరారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే రూ.7,625 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో వేశామని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 16 వేల మెగావాట్లకు పైగా పెరిగినా ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా చూస్తున్నామని అన్నారు.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అన్నారు. మహిళలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, యాభై లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గుర్తు చేశారు. ఈనెల 31వ తేదీ లోపు రూ.7,621 కోట్లు రైతు భరోసా కింద రైతుల ఖాతాలో జమ చేస్తామని హామీనిచ్చారు. యాభై లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్ని చేస్తున్నా బిఆర్‌ఎస్, బిజెపి ఒక్కటై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని, ఆ పార్టీ నేతలకు ఆడబిడ్డలు గుణపాఠం చెప్పాలన్నారు. 150 కోట్ల మంది ఆడ బిడ్డలు ఆర్‌టిసిలో ఉచిత ప్రయాణం చేశారని 1000 బస్సులను స్వయం సహయక మహిళలతో కొనుగోలు చేయించి ఆర్‌టిసికి అద్దెకు ఇచ్చేలా చేశామన్నారు. హైటెక్ సిటీ, శిల్పారామం పక్కనే స్వయం సహాయక మహిళల కోసం 150 స్టాల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రపంచ దిగ్గజ ఐటి సంస్థల పక్కనే మహిళా సంఘాలకు మూడున్నర ఎకరాల స్థలం ఇస్తారని ఎప్పుడైనా ఊహించారా అని అన్నారు.

అదానీ, అంబానీలే కాదు స్వయం సహాయక మహిళలు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు బట్టలు కుట్టే పనిని స్వయం సహాయక మహిళలకు కల్పించామని, ప్రభుత్వ పాఠశాలను నిర్వహించే బాధ్యతను స్వయం సహయక సంఘాలకు మహిళలకు ఇచ్చామని అన్నారు. రాష్ట్రంలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుతో ఇస్తున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు క్రియాశీలకంగా పనిచేశారని, 10 ఏళ్లలో కెసిఆర్ నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కానీ ఆయన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో మొదటి ఏడాదిలోనే 55,163 ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారని అన్నారు. 22 వేల టీచర్లకు ప్రమోషన్లు, 35 వేల టీచర్లకు బదిలీలు చేసి వారి సమస్యలు పరిష్కరించామన్నారు. పదేళ్లపాటు కెసిఆర్ ఫాంహౌస్‌లో పడుకొని ప్రజల గురించి ఆలోచించలేదని ఎద్దేవా చేశారు.

పదేళ్లలో ప్రాజెక్టులు కడితే పాలమూరు ప్రజలు ఎందుకు వలస పోతున్నారని ప్రశ్నించారు. వలసలు పోతున్న పాలమూరు ప్రజల గురించి కెసిఆర్ ఏనాడైనా ఆలోచన చేశారా అని అన్నారు. ఎస్‌ఎల్‌బిసిలో ప్రమాదం జరిగితే హరీశ్‌రావు విహార యాత్రలు చేశారని విమర్శించారు. భీమా, కల్వకుర్తి, నెట్టంపాడు ఎందుకు పూర్తి చేయలేదని, ఆర్‌డిఎస్ ఎందుకు ఎండిపోయిందని, తుమ్మిళ్ల ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ఎస్‌ఎల్‌బిసి పదేళ్ల పాటు పడావుగా పెట్టడంతో కుప్పకూలిపోయిందని, ఈ పాపం కెసిఆర్‌ది కాదా అని అన్నారు. ఆంధ్రావాళ్లు రాయలసీమకు నీళ్లు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించి కెసిఆర్ చూడలేదా ..? ప్రగతి భవన్‌కు అప్పటి ఎపి సిఎం జగన్‌ను పిలిచి పంచభక్ష పరమాన్నం పెట్టి రాయలసీమ ఎత్తిపోతలకు పునాది రాయి వేసింది కెసిఆర్ కాదా అని నిలాదీశారు. రోజమ్మ ఇంటికి పోయి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాలసీమ చేస్తానని అన్న సన్నాసి కెసిఆర్ కాదా అన్నారు. కెసిఆర్ చర్మం ఒలిచి పాలమూరు ప్రజలకు చెప్పులు కుట్టినా తక్కువేనని అన్నారు. ‘మహబూబ్‌నగర్ ప్రజలు నిన్ను గుండెల్లో పెట్టుకొని ఎంపిగా గెలిపించుకుంటే ఏంచేశావు.

పాలమూరు ద్రోహి కెసిఆర్ … కృష్ణా జలాలు ఆంధ్రా తరలించుకుపోతున్నారంటే దానికి కారణం కేసిఆర్ దుర్మార్గం వల్లనే … కృష్ణా జలాల కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగేలా సంతకం పెట్టిన దుర్మార్గుడు కెసిఆర్..ఆ సంతకమే తెలంగాణకు యమపాశంగా మారింది’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి యేడాది కాకముందే మమ్మల్ని దిగిపోమని బఆర్‌ఎస్ సన్నాసులు అంటున్నారని, తెలంగాణలో అభివృద్ధి జరిగితే మరో 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, సిఎంగా రేవంత్ రెడ్డి ఉంటారనే ఉద్దేశంతో కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించి బిఆర్‌ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని, ఇపుడు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఓర్వలేకపోతున్నారని అన్నారు. పాలమూరు వాళ్లది అమాయకత్వం కాదని.. మంచితనం అని, తిక్క రేగితే డొక్క చీల్చి డోలు కడతం జాగ్రత్త అని హెచ్చరించారు. ‘కెసిఆర్.. నువ్వు చెప్పే హరికథలు, పిట్టకథలు నడవవ్’ అని అన్నారు. పండుగల సాయన్న, పుట్టపాగ మహేంద్రనాథ్, జైపాల్ రెడ్డి లాంటి వారిని కన్న నేల పాలమూరు అన్నారు.

నానా కష్టాలు పడి వరంగల్‌కు ఎయిర్‌పోర్టు తీసుకువస్తే కిషన్ రెడ్డి తానే తీసుకువచ్చాననని చెబుతున్నాడని, మెట్రో విస్తరణ అనుమతులు, మూసీ నది ప్రక్షాళనకు నిధులు, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు, కాళేశ్వరానికి నీటి కేటాయింపులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నాడని ఆరోపించారు. తెలంగాణకు ఏదైనా వస్తే తన ఖాతాలో కిషన్ రెడ్డి వేసుకుంటున్నాడని, 12 ఏళ్లలో మోదీ 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని, తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో కిషన్ రెడ్డి లెక్క పెట్టి చెప్పాలన్నారు.

తెలంగాణలో మోదీ రెండు బోడి ఉద్యోగాలు ఇచ్చాడని.. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. సికింద్రాబాద్‌లో వరదలు వచ్చి కొట్టుకుపోతే కేంద్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదన్నారు. కిషన్ రెడ్డి కడుపు నిండా అసూయ, కుళ్లు పెట్టుకొని కాళ్లలో కట్టెలు పెడుతున్నాడని ఆరోపించారు. తన సొంత నియోజకవర్గమైన సికింద్రాబాద్‌కు కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ కట్టర్ వచ్చి సమీక్ష చేస్తే కిషన్ రెడ్డి ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు.రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులు, నిధులపైన అన్ని పార్టీల ఎంపిలతో తమ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహిస్తారని, చిత్తశుద్ధ్ది ఉంటే హాజరు కావాలని, అంతా కలిసి కేంద్రం దగ్గరకు వెళ్లి రాష్ట్రానికి కావాల్సిన నిధులు అడుగుదామని అన్నారు. తెలంగాణకు ఏదో ఒక చేయాలని మోదీ సానుభూతితో ఉన్నారని, కిషన్ రెడ్డి పగతో ఉన్నాడని, సైంధవుడిలా అడ్డుపడుతున్నాడని విమర్శించారు. తన చీకటి మిత్రుడు కెసిఆర్ అధికారం పోయిందని కిషన్ రెడ్డి బాధపడుతున్నాడని ఆరోపించారు. తెలంగాణను అభివృద్ధ్ది చేయవద్దా.. పాలమూరు అభివృద్ధికి ఎవరు అడ్డుపడినా సహించనని హెచ్చరించారు. తెలంగాణకు వన్నె తెచ్చే విధంగా పాలన కొనసాగిస్తానని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News