Wednesday, January 22, 2025

ఇడిని బిజెపి ఎలక్షన్ డిపార్ట్ మెంట్ గా మార్చుకుంది: రేవంత్

- Advertisement -
- Advertisement -

Revanth Reddy fire on Congress

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు భయపడి బిజెపి కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇడి అధికారులతో కాంగ్రెస్ నాయకులను వేధింపులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ముఖ్య నాయకులను ఇడి కేసులతో భయపెట్టి వారిని బిజెపిలోకి చేర్చుకోవాలని చూస్తోందన్నారు. రాహుల్ పాదయాత్రతోనే మార్పు వస్తుందనే.. గతంలో మూసేసిన హెరాల్డ్ కేసును మళ్లీ తెరిచారని మోడీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

హెరాల్డ్ కేసులో ఎలాంటి తప్పిదాలు జరగలేదని గతంలోనే కేసును మూసేశారని, రాహుల్ పాదయాత్రను అడ్డుకునేందుకే కేసును మళ్లీ తెరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఇడి అధికారులను ఉసిగొలిపి రాహుల్ ను విచారణకు పిలిచారని, కాంగ్రెస్ ఎఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనారోగ్యంతో ఉన్నా.. ఆమెను విచారణకు పిలిచి వేధింపులకు పాల్పడ్డారని, అయినా భారత్ జోడో యాత్ర ఆగకపోవడంతో రాష్ట్రాల నేతలకు నోటీసులు ఇస్తున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.

కర్ణాటకలో యాత్రను అడ్డుకునేందుకు శివకుమార్ కు కూడా ఇడి విచారణకు పిలిచిందని మండిపడ్డారు. ఏయే రాష్ట్రాల్లో పాదయాత్ర ఉందో.. అక్కడి నేతలకు ఇడి నోటీసులిస్తుందని దుయ్యబట్టారు. ఇడిని బిజెపి ఎలక్షన్ డిపార్ట్ మెంట్ గా మార్చుకుందని చురకలంటించారు.  గీతారెడ్డి, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కుమార్ లాంటి క్రియాశీల నాయకులకు ఇడి నోటీసులిచ్చిందన్నారు. కోటి రూపాయల చందా ఇచ్చినందుకు అయిదుగురు నేతలకు నోటీసులిచ్చారని, వారిని భయపెట్టి పాదయాత్రలో పాల్గొనకుండా చేయాలని చూస్తున్నారని, బిజెపికి చందాలు ఇచ్చిన ఏ ఒక్కరికైనా నోటీసులిచ్చారా? అని ప్రశ్నించారు. గత ఆరు సంవత్సరాల నుంచి బిజెపికి 4841 కోట్ల రూపాయలు చందాలు వచ్చాయని, చందాలు ఇచ్చిన బిజెపి నేతలకు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News