Thursday, January 23, 2025

ఈటలపై రేవంత్ ఫైర్… ప్రతి రూపాయి కార్యకర్తలదే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ నుంచి నిధులు తీసుకున్నారనే వ్యాఖ్యలను రేవంత్ ఖండించారు. ముగుగోడులో ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి కార్యకర్తలదే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించారు.

కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చిన చందాలనే ఎన్నికల్లో ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు. నాపై ఆరోపణలను నిరూపించడానికి ఈటల సిద్ధమా? అని రేవంత్ ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార బిఆర్ఎస్ పార్టీ నుంచి రూ. 25 కోట్లు తీసుకుందని ఈటల రాజేందర్ ఆరోపించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News