- Advertisement -
హైదరాబాద్ : టిపిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి మోడీ ప్రభుత్వం ఆదాని, అంబానీలకు దోచి పెడుతోందని విమర్శించారు. భవిష్యత్తులో సైన్యంలో కూడా ప్రైవేటీకరణలో భాగంగానే అగ్నిపథ్ పథకం తీసుకువచ్చారు. అగ్నిపత్ పథకాన్ని రద్దు చేసే వరకు పోరాడుతామని అన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కూడా దీనిపై పోరాడతాం, కక్ష సాధింపు వేధింపు రాజకీయాల్లో భాగంగానే రాహుల్ సోనియా పై ఈడి విచారణ జరుపుతున్నారు. ప్రజా సమస్యలపై రాహుల్ గాంధీ పోరాడుతున్నందునే ఆయన పై కక్ష కట్టి కేసులు పెట్టి విచారణ చేస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు వంద కేసులు పెట్టిన ఏమి చేయలేరు. ప్రజల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని అయన తెలిపారు.
- Advertisement -