Thursday, December 19, 2024

రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా దుష్ట పాలన : రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మరిపెడః వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురడం ఖాయమని టిపిసిసి రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా గురువారం నర్సింహులపేట మండలం పెద్దనాగారం స్టేజీ నుంచి రేవంత్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభం కాగా మరిపెడ మండలానికి పాదయాత్ర చేరుకోగానే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నాం భోజన విరామం ప్రారంభమైన పాదయాత్ర రాత్రికి మరిపెడ పట్టణ కేంద్రానికి చేరుకుంది. అనంతరం పట్టణ కేంద్రంలోని విశ్రాంతి భవనం వద్ద సభ నిర్వహించారు. పలు చోట్ల ప్రజలు, కూలీలు, రైతులతో ముచ్చటించారు.

అనంతరం మీడియాతో, రాత్రి సభలోనూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో తొమ్మిదేళ్లుగా దుష్ట పాలన సాగుతుందన్నారు. పేదలకు సొంత ఇళ్లు నిర్మించని కెసిఆర్ రూ. వేల కోట్లు ఖర్చు చేసి ప్రగతి భవన్ నిర్మించుకున్నారు. అందులోకి పేదలు, తెలంగాణ ఉద్యమకాలకు ప్రవేశం లేనప్పుడు ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతామంటే తప్పేంటి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక్కడి అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇసుక, బెల్లం, బియ్యం మాఫియా, అనేక క్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

రెండు లక్షల రుణ మాఫీ, పోడు భూములన్నింటికి పట్టాలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకం, ఫీజురియంబర్స్‌మెంట్స్ ఇవ్వాలన్నా, ధరణి రద్దు కావాలన్నా చంద్రశేఖర్ రావు పోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. పాపాల బైరవుడు కెసిఆర్‌ను గద్దె దించాలంటే యువకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, డాక్టర్ రాంచంద్రునాయక్, మాలోతు నెహ్రునాయక్, జిల్లా మహిళా అధ్యక్షురాలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News