Sunday, December 22, 2024

చినజీయర్ వ్యాఖ్యలపై రేవంత్ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

Revanth Reddy fires on Chinna Jeeyar Swamy comments

తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్

హైదరాబాద్: సమ్మక్క సారలమ్మలపై త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిమీద ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన ‘సమ్మక్క, సారలమ్మలను ఆనుమానపరిచిన త్రిదండి చినజీయర్‌ని యాదగిరిగుట్ట ఆగమ శాస్త్ర సలహదారుడి బాధ్యతల నుండి తక్షణమే ప్రభుత్వం తొలగించాలని, మన భక్తి విశ్వాసాలపై దాడి చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, తాజాగా చినజీయర్ స్వామి మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో చినజీయర్ స్వామి ఏదో ప్రసంగం సందర్భంగా సమ్మక్క సారలమ్మలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చాలా పాత వీడియో. ఏ సందర్భంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారో తెలియడం లేదు. కానీ దీని మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలా మంది ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News