Sunday, January 19, 2025

ఉద్యమం పేరుతో కెసిఆర్ కలెక్షన్లు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు.. ప్రజా ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో విష నాగులు రాజ్యమేలుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వంకుట్ల చంద్రశేఖర్ రావుపై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఢిల్లీ ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. “ఉద్యమం పేరుతో కెసిఆర్ ఎలక్షన్లు, కలెక్షన్లు, సెలక్షన్లు మాత్రమే చేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ద్రోహులందరికి పట్టం కట్టిండు. నిక్కర్ పార్టీ, లిక్కర్ పార్టీ ఒక్కటి అయ్యాయి.

క్రిమినల్ తో పోరాటం చేయొచ్చు, పొలిటీషియన్ తో పోరాటం చేయొచ్చు.. కానీ మనం పోరాటం చేస్తున్నది క్రిమినల్ అండ్ పొలిటీషియన్లతో.. వ్యూహాత్మకంగా పోరాటం చేయమని గద్దరన్న నన్ను హెచ్చరించాడు. గద్దరన్న చివరి కోరిక నెరవేర్చే భాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. గడీల పాలన అంతం చేస్తాం, తుది దశ ఉద్యమాన్ని విజయ తీరాలకు చేరుస్తం. బీఆర్ఎస్ కు అత్యధికంగా 25 స్థానాలు మాత్రమే వస్తాయి. అందుకే కెసిఆర్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో పేదల సమస్యలపై మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీని తిట్టేందుకే కెసిఆర్, కెటిఆర్ వ్యవహరించారు” అని మండిపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News