Sunday, January 19, 2025

ఖమ్మం పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ జనగర్జన సభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మంలో తనిఖీల పేరుతో వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులపై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, మధయాష్కి గౌడ్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభకు భారీగా ప్రజలు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పలు గ్రామాల నుంచి వచ్చే వాహనాలను పోలీసులు అడ్డుకుంటుండంతో ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి అంజని కుమార్ కు ఫోన్ చేసిన రేవంత్.. వాహనాలను అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. దీంతో సభకు వెళ్లే వాహనాలను ఆడ్డుకోకుండా ఆదేశాలిస్తామని డిజిపి తెలిపారు. కాగా, ఈ రోజు సాయంత్రం జరగనున్న జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన అనుచరులు పార్టీ చేరనున్నారు.

Also Read: కాంగ్రెస్ జనగర్జన సభపై బిఆర్ఎస్ కుట్ర.. అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News