Thursday, December 26, 2024

ప్రజలు పడుతున్న కష్టాల్లో కాంగ్రెస్ నాయకులు అండగా ఉండాలి: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ప్రజలు పడుతున్న కష్టాల్లో కాంగ్రెస్ నాయకులు అండగా ఉండాలి
టిపిసిసి అధ్యక్షుడు, రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ప్రజలు పడుతున్న కష్టాల్లో కాంగ్రెస్ నాయకులు వారికి అండగా ఉండాలని టిపిసిసి అధ్యక్షుడు, రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో వరదలు, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో టిపిసిసి సీనియర్ నాయకులతో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసిసి ఇన్‌చార్జి మానిక్‌రావ్ ఠాక్రే జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ టిపిసిసి పిఈసి సభ్యులు, ఉపాధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేడు గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చామన్నారు. వరదలతో ఉపాధి కోల్పోయిన పేదలకు, కార్మిక కుటుంబాలకు వెంటనే 10 వేల రూపాయలు అందించా లన్నారు. బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పందించి కేంద్రం నుంచి వరదసాయం వచ్చేలా చూడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ఉండి పని చేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ కేంద్రంగా ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి వరదలు తదితర పునరావాస సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు. వరదలు, భారీ వర్షాలతో కొల్లాపూర్‌లో జరగబోయే ప్రియాంక గాంధీ సభను వాయిదా వేస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News