- Advertisement -
సిద్దిపేట: ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్‌లు దుబ్బాకకు చేసిందేమీ లేదని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. దుబ్బాకు చెరుకు ముత్యంరెడ్డి అభివృద్ధి చేశారని, చెరుకు ముత్యం రెడ్డిది ఆదర్శకుటుంబం అని ప్రశంసించారు. కెసిఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ అని, కెసిఆర్ తెలంగాణను బొందలగడ్డగా మార్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వస్తుందని మళ్లీ ఇందిరమ్మ రాజ్యం పాలన వస్తుందని ప్రశంసించారు. దుబ్బాకను సిఎం కెసిఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. దుబ్బాకకు వచ్చే నిధులు సిద్దిపేటకు మళ్లించారని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే దుబ్బాక అభివృద్ధి జరిగిందని కొనియాడారు. దుబ్బాకకు డిగ్రీ కాలేజీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
- Advertisement -