Friday, December 20, 2024

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసులో ఎదురుదెబ్బతగిలింది. రేవంత్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. ఓటు నోటు కేసుపై అక్టోబర్ 4న సుప్రీంలో మళ్లీ విచారణ జరగనుంది. ఓటుకు నోటు కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముద్దాయిగా చేర్చాలని సుప్రీంకోర్టులో గతంలో ఎపిలోని మంగళగిరి ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణ రెడ్డి రెండు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఎసిబి నుంచి ఓటుకు నోటు కేసును సిబిఐ అప్పగించాలని మరో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. 2015లో తెలంగాణలో ఎంఎల్‌సి ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News