Tuesday, November 5, 2024

నాలుగున్నర లక్షల ఇండ్లు ఇస్తాం: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం భద్రాద్రి: పేదల కష్టాలు చూసి ఆనాడు దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఈ ఇళ్లను ప్రారంభించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పేదల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు అని, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల సంక్షేమం అని పేర్కొన్నారు. మణుగూరులో ఇందిరమ్మ ఇంటి మోడల్‌ను సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రసంగించారు. భద్రాద్రి రాములోరి ఆశీర్వాదం తీసుకొని ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించామన్నారు. తెలంగాణలో నాలుగున్నర లక్షల ఇండ్లు ఇవ్వబోతున్నామని, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తామని చెప్పారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనని, ఇంటి నిర్వహణ మహిళ చేతిలో ఉంటే ఆ ఇల్లు బాగుంటుందని, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని స్పష్టం చేశారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ చెప్పిందే చెప్పి పదేళ్లు పేద ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. పేదల కలల మీద కెసిఆర్ ఓట్ల వ్యాపారం చేశారని, విశాలమైన ఇళ్లు ఇస్తామంటూ పేదలను కెసిఆర్ మోసం చేశారని మండిపడ్డారు. గత ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ను బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారని మెచ్చుకున్నారు. మొదటి నుంచి కెసిఆర్‌ను ఖమ్మం ప్రజలు నమ్మలేదని, 2014, 2018, 2023లో బిఆర్‌ఎస్‌కు ఖమ్మం ప్రజలు ఒక్క సీటు కట్టబెట్టారన్నారు. రూ.500లకే సిలిండర్‌ను మహిళలకు ఇస్తున్నామని రేవంత్ తెలియజేశారు. రూ.50 ఉన్న పెట్రోలను మోడీ ప్రభుత్వం రూ.110 చేసిందని దుయ్యబట్టారు. రూ.15 లక్షలు ఇస్తామన్న మోడీ ఒక్క లక్ష రూపాయలైనా ఇచ్చారా? అని ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News