Wednesday, February 26, 2025

రాష్ట్రానికి అన్ని రకాలుగా సహాయం అందించాలి: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎస్ఎల్ బిసి ప్రమాద ఘటనను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి వివరించానని తెలియజేశారు. మోదీతో గంటపాటు సిఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై ప్రధానితో రేవంత్ చర్చించారు. తెలంగాణలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు కేంద్ర సాయం చేయాలని, విభజన చట్టం లోని పెండింగ్ సమస్యలను పూర్తి చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా సాయం అందించాలని కోరారు. కేంద్ర బడ్జెట్ లోనూ రాష్ట్రానికి కేటాయింపులు లేవని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని, మూసీ నది ప్రక్షాలనకు కేంద్రం సహకరించాలని, దీంతో పాటు రాష్ట్రంలోని చెరువుల పునరుద్ధరణకు ఆర్థిక సాయం చేయాలని రేవంత్ రెడ్డి మోడీని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News