Friday, December 27, 2024

కాంగ్రెస్ కుటుంబంలో అవి సహజమే: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు సహజమే
అధిష్టానం ఆదేశాలతో కుంభం అనిల్ ను పార్టీలోకి ఆహ్వానించాం
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్: 2018 ఎన్నికల్లో ఓడినా కుంభం అనిల్ కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారని, టిపిసిసి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతి కార్యక్రమాన్ని అనిల్ విజయవంతం చేశారని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు సహజమని, కాంగ్రెస్ సర్వేలో కుంభం అనిల్ కుమార్ రెడ్డికి అనుకూలంగా వచ్చిందని, అందులో భాగంగా ఆయన్ను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని పార్టీ నిర్ణయించిందన్నారు.

అధిష్టానం ఆదేశాలతో అనిల్ ను పార్టీలోకి ఆహ్వానించామని, నియోజకవర్గంలో కార్యకర్తల ఒత్తిడితో కుంభం అనిల్ సొంతగూటికి చేరారని రేవంత్ తెలిపారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డికి పార్టీలో సముచితమైన స్థానం కల్పిస్తామని, భువనగరి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయమని, ఈ క్షణం నుంచి భువనగిరి కార్యకర్తలకు అనిల్ అండగా ఉంటారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News