Wednesday, January 22, 2025

రేవంత్ రాజకీయ ప్రస్థానం

- Advertisement -
- Advertisement -

ప్రతి పనిలో ఆయనది ప్రత్యేక శైలి
22 ఏళ్ల కితం చెప్పిన మాట నిజం చేసుకున్న నాయకుడు
ఎన్ని సవాళ్లు ఎదురైన ప్రత్యర్ధులను ఢీకొన్న ధీశాలి
అనుకున్న లక్ష్యాన్ని చేధించి చరిత్ర సృష్టించిన రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ప్రకటించిన మరుక్షణ నుంచి నలుగురు కూడిన చోట టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి మాటే…కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకరావడంతో సఫలీకృతుడైయ్యాడని రాష్ట్రమంతటా చర్చ… పార్టీ గెలుపును భుజస్కందాలపై వేసుకుని తెలంగాణ వ్యాప్తంగా 80 బహిరంగ సభలు పెట్టి పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో ఆయన కృషి సాటిలేదని ప్రశంసలు….చిన్నవయస్సులో రాష్ట్రానికి రెండో వ్యక్తిగా ముఖ్యమంత్రి కావడం చరిత్ర సృష్టించారని పొగడ్తలు….రాజకీయ చతురుత, పట్టుదల, దైర్యసాహసం ఆయనను ముఖ్యమంత్రి పీఠం వరించిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అనుముల రేవంత్‌ రెడ్డిది బాల్యం నుంచే ప్రత్యేక శైలి, దూకుడు స్వభావం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ల తరువాత రాష్ట్రంలో అధికారాన్ని అందించిన నాయకుడు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే పార్టీని గద్దెనెక్కించిన యువనేత. ఆయన ప్రతి అడుగూ సంచలనమే. రేవంత్ రాజకీయ ప్రస్థానంలో ప్రతి దశా ఆసక్తికరమే. కింద పడిన ప్రతిసారీ దైర్యం చేసుకుని లక్షం చేరుకునే వరకు ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి ఎదిగారే తప్ప ఎన్నడూ వెనకడుగు వేయలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వెంటనే మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించి తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వ పతనం కోసమే పనిచేయడం. అనుకున్నది సాధించడం ఆతనికి సాధ్యమైంది.

తెలంగాణ రాష్ట్రానికి నా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యమంత్రి చేస్తానని 22 ఏళ్ల క్రితమే చెప్పిన రేవంత్‌రెడ్డి అదే లక్ష్యంతో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైన ముందుకు అడుగులు వేశారు. 1969 నవంబరు 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోకవర్గం వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో అనుముల నర్సింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు రేవంత్ రెడ్డి జన్మించారు. ఆయనకు ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. వీరిది సాధారణ రైతు కుటుంబం. బాల్యం నుంచే రాజకీయాలంటే ఆసక్తి. విద్యార్ధి దశలో ఎబివిపి, తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌లో చురుగ్గా పనిచేశారు. గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తరువాత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడు రాంరెడ్డి కుమార్తె గీతారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఈ పెళ్లి కూడా సంచలనమే. జీవనోపాధి కోసం ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించి ఆర్థికంగా ఎదిగారు. రేవంత్‌రెడ్డి దంపతులకు ఒక కుమార్తె సైమిషా రెడ్డి. తరువాత జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగు పెట్టి స్వల్పకాలంలో కోటీశ్వరుడయ్యాడు. 2004లో కొంత కాలం టిఆర్‌ఎస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా ఉండి కల్వకుర్తి అసెంబ్లీ టికెట్ ఆశించారు. చిన్న వయస్సు కావడంతో అప్పట్లో టికెట్లు దక్కలేదు. దీంతో 2006లో జరిగిన స్ధానిక సంస్థల ఎన్నికల్లో మిడ్జిల్ మండలం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జడ్పిటిసిగా పోటీ చేసి గెలుపొందాడు. తదనంతరం జరిగిన స్థానిక సంస్థల కోటాలో మహబూబ్ నగర్ శాసనమండలి ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి విజయం సాధించాడు.

2006లో మిడ్జిల్ మండలం జడ్పిటిసి సభ్యునిగా విజయం.
2007 లో స్దానిక సంస్థల ఎమ్మెల్సీగా స్వాతంత్రంగా ఎన్నిక, టిడిపిలో చేరిక
2009లో కొడంగల్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
2014 అక్కడ నుంచే రెండోసారి పోటీ చేసిన విజేతగా నిలిచారు.
2014 నుంచి 2017 వరకు టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నియమాకం
2017లో టిడిపికి రాజీనామా, కాంగ్రెస్ పార్టీలో చేరిక
2018లో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఈ ఎన్నికల్లో కోడంగల్ నుంచి ఓటమి
2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలుపు.
2021 జూన్‌లో 26న టీపీసీసీ అధ్యకుడిగా రేవంత్‌రెడ్డి నియమాకం.
2021 జూలై 7న టిపిసిసి చీఫ్ గా ప్రమాణ స్వీకారం
2023 డిసెంబర్ 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News