Thursday, January 23, 2025

రేవంత్‌రెడ్డి అనుచిత వాక్యాల పట్ల మండిపడ్డ ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

సుల్తానాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మండలంలోని గర్రెపల్లి రైతువేదిక వద్ద సోమవారం మండల బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్‌ను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై ఎమ్మెల్యే మండిపడ్డారు.

ఎమ్మెల్యే మండలంలోని గర్రెపల్లి రైతువేదికలో గర్రెపల్లి, బొంతకుంటపల్లి, నర్సయ్యపల్లి, భూపతిపూర్, ఐతరాజ్‌పల్లి, దుబ్బపల్లి, సాంబయ్యపల్లి, నారాయణరావుపల్లి, గొల్లపల్లి గ్రామాల రైతులతో కలిసి రైతు వేదికలో రైతన్న సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై రైతులతో తీర్మాణం చేయించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమితి కో ఆర్డినేటర్ కాసర్ల అనంతరెడ్డి, ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, రైతు సమితిమండల కో ఆర్డినేటర్ బోయిని రాజమల్లయ్య, ఎఎంసీ చైర్మన్ బుర్ర మౌనిక – శ్రీనివాస్, మండల అధ్యక్షుడు పురం ప్రేమ్‌చందర్‌రావు, కెడీసీసీబీ డైరెక్టర్ శ్రీగిరి శ్రీనివాస్, పీఎసీఎస్ చైర్మన్లు జూపల్లి సందీప్‌రావు, మోహన్‌రావు, కన్వీనర్లు శ్రీనివాస్‌రెడ్డి, ధీకొండ భూమేష్, రవి, సర్పంచ్‌లు వీరగోని సుజాత – రమేష్ గౌడ్, అనిత – తిరుపతి,

లావణ్య – వెంకటేశ్, వెంకన్న, బాపురెడ్డి, రమేష్, లక్ష్మీ – అంజయ్య, ఎంపీటీసీలు విజయ – రమణారెడ్డి, గట్టు శ్రీనివాస్, మాజీ సర్పంచ్‌లు పడాల అజయ్, రాజ్‌కుమార్, ఆసరి రాజయ్య, పీఎసీఎస్ వైస్ చైర్మన్ ధీకొండ శ్రీనివాస్, ఉపసర్పంచ్‌లు, గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి, తిరుమల్‌రావు, ఆసరి రమేష్, శ్రీనివాస్, కరుణాకర్‌రెడ్డి, ప్రశాంత్, ఎఎంసీ డైరెక్టర్లు ఆంజనేయులు, రజని, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News