Thursday, December 26, 2024

రేవంత్ రెడ్డి నాకు మంచి మిత్రుడే : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడేనని కెటిఆర్ అన్నారు. ఆయన పద్దెనిమిదేళ్లుగా తనకు తెలుసునన్నారు. గత పదేళ్ల నుంచి ఆయనకు, తమకు చెడిందన్నారు. పదేళ్ల క్రితం తాము అధికారంలోకి వచ్చినప్పుడు 1800 కోట్లు ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలను విడుదల చేశామన్నారు. మన వద్ద రీకాల్ సిస్టం లేదు కాబట్టి తెలంగాణ ప్రజలు నాలుగేళ్ళు ఈ ప్రభుత్వాన్ని భరించాల్సిందేనని, ప్రజలకు ఇక వేరే మార్గం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క బుధవారం ద్రవ్య వినిమయ బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై కేటీఆర్ చర్చను ప్రారంభించారు. బడ్జెట్‌పై తమను ప్రతిపక్షం అభినందిస్తుందని భావించానని భట్టివిక్రమార్క అన్నారని… కానీ ఏం చూసి అభినందించాలో చెప్పాలన్నారు.

నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పినందుకు అభినందించాలా? డిక్లరేషన్‌లకు దిక్కుమొక్కు లేకుండా చేసినందుకు అభినందించాలా? 420 హామీలను తుంగలో తొక్కినందుకు అభినందించాలా? అభినందించడం కాదు అధ్యక్షా… అభిశంసించాలి. మన వద్ద రీకాల్ సిస్టం లేదు కాబట్టి ప్రజల మిమ్మల్ని నాలుగేళ్లు భరించాల్సిందే అన్నారు. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. తెలంగాణ వారికి పాలించే సత్తా ఉందా? అని ఉద్యమం సమయంలో చాలామంది అన్నారని, పదేళ్ల క్రితం నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణ ఇస్తే ఈ రాష్ట్రం చీకట్లతో నిండిపోతుందన్నారని గుర్తు చేశారు. పదేళ్లలో తెలంగాణ సంపద పెరిగిందని గతంలో చెప్పిన భట్టివిక్రమార్క, అధికారంలోకి వచ్చాక మాత్రం మాట మారుస్తున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News