Monday, December 23, 2024

రూ.500కే సిలిండర్ పై ముఖ్యమంత్రి కీలక ప్రకటన

- Advertisement -
- Advertisement -

గతంలో మహిళల కష్టాలను దృష్టిలో పెట్టుకుని రూ. 400కే గ్యాస్ ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రూ. 1200 ఉన్న గ్యాస్ సిలిండర్ ను త్వరలో మహిళలకు రూ.500లకే ఇస్తామని చెప్పారు. ఎక్కువగా వస్తున్న విద్యుత్ బిల్లులపై మాట్లాడిన సిఎం 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామన్నారు. మహిళల గౌరవం నిలబెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. గత కాంగ్రెస్ సిఎంలు మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చారని తెలిపారు. మహిళలు ఆత్మగౌరవంతో ఉండి.. 10 మందికి ఆదర్శంగా నిలవాలని కోరారు. కేస్లాపూర్ లో మహిళా సంఘాల సభ్యులతో సిఎం రేవంత్ రెడ్డి ముఖాముకి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, కోమటి రెడ్డి, తుమ్మల, సీతక్క పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News