Sunday, December 22, 2024

దళిత యువకుడిని కాలితో తన్నిన రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

తొర్రూరు : పాలకుర్తిలో గురువారం జరిగిన కాంగ్రెస్ సభలో దళిత యువకుడిని కాలితో తన్నిన పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జెడ్పీప్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రాంచంద్రయ్య అన్నారు. శుక్రవారం డివిజన్ కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పాలకుర్తిలో గురువారం జరిగిన కాంగ్రెస్ సభలో సిఎం కెసిఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావులపై రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు సరికాదన్నారు. కాంగ్రెస్ సభలో దళిత యువకున్ని కాలితో తన్ని అవమానించినందుకు బిఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే దళితులను అన్ని విధాలుగా ఆదుకుందని అన్నారు. దళితుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. గిరిజనుల అభివృద్ధి కోసం తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో దళితులకు ప్రాధాన్యత కరువైందన్నారు. నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తున్న ఎర్రబెల్లిపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. దళితుల పట్ల దురుసుగా ప్రవర్తించిన రేవంత్‌రెడ్డిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తొర్రూరు మాజీ సర్పంచ్ ధరావత్ రాజేశ్‌నాయక్, బోజ్యతండా సర్పంచ్ కాలునాయక్, నాయకులు జనార్థన్‌రాజు, జాటోతు టీకునాయక్, బీకునాయక్, రాయిశెట్టి వెంకన్న, స్వామినాయక్, సురేశ్, కేశవ్, వినయ్‌కుమార్, వెంకన్న, అశోక్, శోభన్, తుకారాం, బాబురావు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News