మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు, ఈ ఫార్ములా, కాలేశ్వరం కేసులను సీబీఐకీ అప్పగించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి స వాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం ని ర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్ర చారంలో భాగంగా రేవంత్ రెడ్డి నిజామాబాద్ బహిరంగ సభలో బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యా పింగ్, గొర్రెల స్కీమ్ కుంభకోణం, ఈ ఫార్ములా రేస్ కే సుల్లో బీఆర్‌ఎస్ నేతలు కెసిఆర్, కెటిఆర్‌లను అరెస్ట్ చేయకుండా, బీజేపీతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సో మవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీఎం రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. రీజినల్ రింగ్ రోడ్డు అనుమతిని రేవంత్ రెడ్డి సీఎం కాకముందే తాను తీసుకు వచ్చానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎవరి ఒత్తిడితోనో పాల్గొన్నారని వ్యాఖ్యానించారు. మూడు ఎమ్మెల్సీలలో కేవలం ఒక్క సీటులో పోటీ చేసిన కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే ఎన్నికలకు ముందే రేవంత్‌రెడ్డి చేతులెత్తేసినట్లు కనిపిస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయినా జరిగే నష్టం లేదని ఓటమిని ఒప్పుకున్నారన్నారు.