Monday, January 27, 2025

నేటి అర్ధరాత్రి నుంచి రైతు ఖాతాలో రైతు భరోసా జమ

- Advertisement -
- Advertisement -

రైతు కూలీలకు ఏడాదికి 12, వేలు
మార్చి 31 వరకు పథకాలు అమలు..
కెసిఆర్ కు ప్రతిపక్ష నేత హోదా దండగ
కాళేశ్వరం కూలిన కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది
చంద్రవంచలో సిఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
నాలుగు ప్రభుత్వ పథకాలు ప్రారంభం

ఇందిరమ్మ రాజ్యం అంటే…. రైతు రాజ్యం… ప్రజా ప్రభుత్వం
వ్యవసాయం అంటే దండగ కాదు… పండుగ..

ఇవాళ ఆదివారం కాబట్టి అర్ధరాత్రి 12 గంటలు దాటగానే ఎకరాకు 6000 చొప్పున రైతు ఖాతాలో రైతు భరోసా నగదు జమ

మహబూబ్ నగర్: తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా వివిధ సంక్షేమ పథకాలను అమలు పరుస్తుందని, ప్రజా పాలనలో ప్రజలే రాజులు ప్రజలే పాలకులు అని, ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రాజ్యం, ప్రజా ప్రభుత్వం అని తెలియజేశారు. ఆదివారం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలంలో చంద్రవంచ గ్రామంలో నాలుగు సంక్షేమ పథకాలను లాంఛనంగా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు మార్చి 31 వరకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు భూమికి విత్తనానికి ఎంత అనుబంధ ఉందో రైతుకు కాంగ్రెస్ అంతా అనుబంధం ఉందని స్పష్టం చేశారు. వ్యవసాయం అంటే దండుగ కాదు పండుగ అని ఆనాడే కాంగ్రెస్ నిరూపించిందని ముఖ్యమంత్రి అన్నారు. సంక్షేమ పథకాలు అమలు పరచడానికి అధికారులను ప్రజల వద్దకే పంపి గ్రామసభలలో లబ్దిదారులను గుర్తించడం జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఏనాడైనా గ్రామసభలు నిర్వహించి ప్రజలకు రేషన్ కార్డు ఇచ్చిందా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

చంద్రవంచ గ్రామం నుంచి ప్రభుత్వం చేపట్టిన నాలుగు పథకాలను ప్రారంభించడం సంతోషంగా ఉందని, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. కొడంగల్ నియోజక వర్గానికి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంటుందని, రైతుకు కాంగ్రెస్ కు చాలా అనుబంధం ఉందని, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందని, ఆనాడు 78 వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేసిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆనాడు చేసిన మంచి పనులను వారసత్వంగా తీసుకుని ఈ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తోందని పేర్కొన్నారు. రైతులకు మొదట విడతలో 7 వేల కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేశామని, రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని, దేశంలో ఎక్కడ కుాడా రుణమాఫీ చేయని విధంగా తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చామని, ఉచిత బస్సు స్కీమ్ ద్వారా 4 వేల కోట్ల రూపాయలు ఆర్టీసీ కార్పొరేషన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందన్నారు.

ఈ రోజు రాత్రి 12 గంటల తరువాత రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాలో ఎకరాకు 6 వేల రూపాయలు అకౌంట్ లో జమ చేయబోతున్నాం అని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని 10 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని, కొడంగల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదన్నారు. మార్చి 31 నాటికి నియోజకవర్గంలో 3500 ఇండ్లు కట్టిస్తామని, రాబోయే నాలుగేళ్లలో ఈ ప్రాంతంలో 15 వేల నుంచి 20 వేల ఇందిరమ్మ ఇండ్లు కొడంగల్ లో నియోజక వర్గంలో కట్టించి తీరుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Revanth reddy launch four schemes

బిఆర్ఎస్ కు రేషన్ కార్డు ఇవ్వాలన్న సోయి లేదని ధ్వజమెత్తారు. కానీ మా ప్రభుత్వం రేషన్ కార్డు ప్రతి పేదవాడికి అందాలని సంకల్పించిందన్నారు. క్రమం తప్పకుండా అధికారులను గ్రామాల్లోకి పంపించి ప్రజాపరిపాలనలో ప్రజలకు మేలు చేసేలా ప్రయత్నం చేశామన్నారు. ప్రజల దగ్గరికే తానే వచ్చానని, రాష్ట్ర స్థాయి అధికారి నుంచి మొదలుకుని ప్రతి ఒక్క అధికారి ప్రజల వద్దకు వస్తున్నారని, ప్రజాపాలన అంటే ఇది అని, ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం మాది అని రేవంత్ తెలిపారు. గత పాలనలో ఈ పరిస్థితి ఉందా?.. దొరల పాలన కొనసాగించారని ధ్వజమెత్తారు. అర్హులైన లబ్ది దారులకు పారదర్శకంగా పథకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, పాలమూరు రంగారెడ్డి, నారాయణపేట సాగునీటి పథకాలు పూర్తి చేస్తామని, బిఆర్ ఎస్ ప్రభుత్వం నాలుగు కోట్ల ప్రజల సంక్షేమం పట్టించుకోలేదని, 13 నెలల కాలంలో ఒక్కసారైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ కి వచ్చారా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు.

ఆయనకు బాధ్యత లేదా అని అడిగారు. కొడంగల్ నియోజక వర్గంలో పరిశ్రమలు తీసుకురావాలని ప్రభుత్వం కృషి చేస్తోందని, పరిశ్రమలు తీసుకుసుంటే అధికారులపై దాడులు చేయిస్తున్నారు, ఇది న్యాయమా? అని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగవద్దా?, మన పిల్లలకు ఉద్యోగ కల్పన కోసం పరిశ్రమలు తీసుకరావాలని చూస్తుంటే బిఆర్ ఎస్ రెచ్చగొడుతుందన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధిని బిఆర్ఎస్ అడ్డుకుంటుందని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు తన సోదరుడు తిరుపతి రెడ్డి అండగా ఉంటారని, కొడంగల్ ప్రజల కోసం మా సొంత భూములు ఇచ్చామని, మార్చి 31 లోపల ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 10 లక్షల కుటుంబాలకు 6 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డులు కుడా పూర్తి చేస్తామని, రైతు భరోసా కుడా మార్చి 31 లోపు వారి అకౌంట్లలో ఎకరాకు 6 వేల రూపాయలు జమ అవుతాయని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News