హనుమకొండ: కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చామని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు తెలిపారు. రైతుబంధు ద్వారా 11 విడతల్లో రూ.72 వేల కోట్లు ఇచ్చామన్నారు. హనుమకొండ జిల్లా బీమదేవరపల్లిలో కరీంనగర్ బిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థి వినోద్‌కు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదు గ్యారంటీలు పూర్తి చేసినట్టు అబద్ధాలు చెబుతున్నారని, రేవంత్ రెడ్డి వెళ్లిన చోటల్లా దేవుళ్లపై ప్రమాణాలు చేస్తున్నారని, మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హామీలు అమలు చేయాలని కోరిన బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను సిఎం దుర్భాసలాడుతుండడం మంచిది కాదని హితువు పలికారు. కాంగ్రెస్ అంటేనే కరువు అని, కాంగ్రెస్, బిజెపి మోస పూరిత హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ గేర్‌లో నడుస్తుందని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు: హరీష్ రావు
- Advertisement -
- Advertisement -
- Advertisement -