Monday, March 31, 2025

ఎమోషనల్ ట్వీట్ చేసిన రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘నిన్న, నేడు, రేపు మీరే నా బలం.. తెలంగాణ రక్షణ కై కదిలిన కాంగ్రెస్ దళం’ అంటూ పేర్కొన్నారు. మరో ట్వీట్ చేస్తూ ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన తెలిపారు. కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటానన్నారు. ఈ గడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటా. దేశానికి కొడంగల్ ను ఒక మోడల్ గా నిలబెడతానని ఎమోషనల్ ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News