Thursday, January 23, 2025

రామోజీరావు కుటుంబసభ్యులను పరామర్శించిన సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రామోజీ గ్రూపు సంస్థల అధినేత స్వర్గీయ రామోజీరావు కుటుంబసభ్యులను సిఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం పరామర్శించారు. రామోజీ ఫిలింసిటీలోని ఆయన నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రామోజీ చిత్రపటానికి నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, తెలుగు మీడియా దిగ్గజం రామోజీ రావు అనారోగ్యం కారణంగా ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. రామోజీ రావు చేసిన సేవలను గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. అయితే, బిజీ షెడ్యూల్ వల్ల రామోజీ రావు అంత్యక్రియలకు సిఎం రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే సిఎం మంగళవారం రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీ రావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. సిఎం రేవంత్ వెంట మంత్రి తుమ్మల, ఎంపి చామల కిరణ్‌కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News