హైదరాబాద్: టాలీవుడ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాకిచ్చారు. ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండని సినీ ప్రముఖులకు తేల్చి చెప్పినట్లు సమాచారం. గురువారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ టాలీవుడ్ ప్రముఖులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని.. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్నామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
అలాగే.. “అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు. ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటాము. తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలి. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలి. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి” అని రేవంత్ చెప్పినట్లు సమాచారం.