- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని సిఎం రేవంత్ రెడ్డి కలిశారు. జానారెడ్డితో రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జానారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తన కుమారుడు జైవీర్ రెడ్డి పోటీ చేయించి గెలిపించాడు. ఇప్పటికే పదకొండు మందికి మంత్రి పదవులు ఇవ్వడంతో ఏడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. హోంమంత్రి పదవి జానారెడ్డికి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
- Advertisement -