Friday, December 20, 2024

పోలీస్ నియామకాలపై హైపవర్ కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పోలీస్ నియామకాలపై జూబ్లీహిల్స్ నివాసంలో హైపవర్ కమిటీతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. పోలీస్ నియామకాల్లో జీవో నెం.46 రద్దు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ రజినీకాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, టిఎస్‌ఎల్‌పిఆర్‌బి చైర్మన్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి, మక్కన్ సింగ్ ఠాగూర్, ఎమ్మెల్సీ వెంకట్ తదితరులు హాజరయ్యారు. త్వరలో కొన్ని ఉద్యోగాలకు నియామక పత్రాలు జారీ చేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై అడ్వకేట్ జనరల్ సలహా, సూచనలను సిఎం రేవంత్‌రెడ్డి కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News